ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 13
__________________________________
‘అపరిశుభ్రతల మధ్య అమ్మవారి ఆలయం’ అనే శీర్షికతో పలు దినపత్రికలోసోమవారం వచ్చిన వార్త కతనాలపై ఎమ్మార్పీఎస్ నాయకులు సంపత్ కుమార్ మాదిగ స్పందించారు. ఆయన కాచిగూడ స్టేషన్ సమీపంలో గల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే శాఖ డబ్బులకు ఆశపడి పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కొరకు అక్కడ ఉన్న గుడిని కూల్చివేసే ప్రయత్నం చేశారని దానిని గమనించిన స్థానికులు అడ్డుకొని రక్షణ కల్పించారని టిలిపారు. అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా చిన్న అమ్మవారి గుడి ఉందని కూడా చూడకుండా చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేసారని తెలిపారు.దీంతో అక్కడ గంజాయి సేవించే వారు ప్రయాణికులు గుడి ఆవరణలో మలమూత్రాలు విసర్జించడం చాలా బాధ కలిగించిందని సంపత్ కుమార్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు అమ్మవారి గుడికి చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి రక్షణ కల్పించి హిందువుల మనోభావాలను గౌరవించాలని కోరారు. ఈ ఈ కార్యక్రమంలో శేఖర్, తిరుపతి, వినయ్ తదితరులు పాల్గొన్నారు















