ఈతరం భారతం 13.10.2026 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం:
_______________________________________________________
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, బ్యాంకుల అధికారులతో సమన్వయ సమావేశం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…ఇటీవల కాలంలో ఏటియం, బ్యాంకుల వద్ద ఆర్ధిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ బ్యాంకు ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలు, అలారం సిస్టంను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు పర్యవేక్షణ ఉండాలని బ్యాంకుల అధికారులకు సూచించారు.
ఏటీఎం వద్ద పోలీస్ గస్తీ విధిగా ఉంటుందని అన్నారు.నేరం జరిగినప్పుడు వచ్చే అలర్ట్ అలారం సిస్టమ్ ను పోలీస్ స్టేషన్ కు లేదా పోలీస్ కామాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. ఏటియం సెంటర్ల బ్యాంకు లోపల, బయట పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు, వారి ప్రవర్తనను సెక్యూరిటీ గార్డులు నిరంతరం గమనించాలని సూచించారు. ఏటీఎంలో నగదు నింపే సమయంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని అన్నారు. బ్యాంకు సిబ్బందికి తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్ అధికారుల ఫోన్ నెంబర్లు తెలిసి ఉండాలని, హెల్ప్‌లైన్, పోలీస్‌స్టేషన్ నెంబర్లను స్పష్టంగా కనిపించే విధంగా బ్యాంకుల్లో ఏర్పాటు చేయాలన్నారు. అనుమానం వచ్చిన వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు. బ్యాంకులు, ఏంటీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. బ్యాంకు అధికారుల విన్నపాలను, సూచనలను పరిగణలోకి తీసుకోని అవసరమైన సహాయసహకారం అందిస్తామని ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అన్నారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, లిడ్ బ్యాంకు మేనేజర్ రవి ప్రసాద్, ఏసీపీలు పాల్గొన్నారు.















