హైదరాబాద్(భాగ్యనగరం) సెప్టెంబర్ 19 (ఈతరం భారతం);అరె కటికలు ఆత్మగౌరవంగా బతుకాలంటే రూ. 500 కోట్లతో ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన ఐ (2) వైన్స్ టెండర్లలో 30శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని అరె కటిక అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంఘం రాష్ట్ర అద్యక్షులు జి. భూంపల్లి అశోక్ కుమార్ మాట్లాడుతూ “మటన్ వృత్తి సారా వృత్తి”జన్మత మాడే అయినా మాకు గత ప్రభుత్వం 2021 సం.లో నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసింది. అప్పటి ఎక్సైజ్ శాఖామంత్రి గౌదలకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% ఏ మాత్రం సంబంధంలేని, వీరికి కట్టబెట్టిండు. మాకు న్యాయం చేయండని అనేక ఉద్యమాలు చేసినా, మెమోరాండాలు ఇచ్చినా మా ఆరె కటికలకు న్యాయం జరుగలేదాని ఆవీదన వ్యక్తం చేసారు. బిసి-డి నుండి బిసి ఎ హోదా కల్పిస్తూ జి.ఓ. తేవాలని, మా మటన్ షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. మా ఆరెకటిక మహిళలకు రూ.3 లక్షల బ్యాంకు రుణం 90శాతం సబ్సిడీతో మటన్ క్యాంటిన్లు, చొక్నాబోటి కర్రీపాయింట్లు ఏర్పాటు చేయాలని, మాకు 80శాతం సబ్సిడీతో గొర్ల పంపిణీ ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశం లో ప్రదానన కర్యదర్శి కే.నందేశ్వర్,ఉపాధ్యక్షులు నాగ శెశు, వెంకటేశ్వర్, జి. రమేష్, జి,కోశాధి కారి కే.దినేష్, నరేందర్ జి,shiva స్రసాద్, బాల కిషన్ జి,జమాల్ పురం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.















