హైదరాబాద్ ఫిబ్రవరి 26 ఈతరం భారతం
;అవుట్డోర్ మీడియా (టోమో) జేఏసీ సభ్యులు విజయపురి వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో సమావేశమై, నూతన అవుట్డోర్ ప్రకటనల విధానం మరియు గౌరవ న్యాయస్థానం ఆదేశాల అమలుపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గౌరవ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం నూతన విధానం రూపకల్పనపై చర్చించేందుకు సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మార్చి 4వ తేదీ లోపు అసోసియేషన్తో సమావేశం ఏర్పాటు చేయనట్లయితే, టోమో జేఏసీ ఆందోళన కార్యక్రమాలకు దిగవలసి వస్తుందని తెలిపారు. తీర్మానించిన కార్యక్రమాలు..ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ముట్ట దించాలని, ఆరు ప్రధాన హైవే ప్రవేశ ద్వారాల వద్ద ధర్నాలు మరియు రాస్తా రోకోలు,గౌరవ ముఖ్యమంత్రిగారి నివాసం ముట్టడి,టోమో జేఏసీ సభ్యులు దశాబ్దాలుగా చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి పన్నులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఆదాయం సమకూర్చుతున్నామని తెలిపారు. గౌరవ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ చర్చలు నిర్వహించడంలో ఆలస్యం జరుగుతుండటంపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అవుట్డోర్ మీడియా రంగాన్ని రక్షించేందుకు మరియు సమగ్ర, పారదర్శక విధానం తీసుకురావడానికే ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.మార్చి 4వ తేదీకి ముందు తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి సమస్యను సఖ్యంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేశారు
.















