ఈతరం భారతం హైదరాబాద్ మే 19
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కట్టలు కట్టలుగా డబ్బు, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి వస్తువులు, హైదరాబాద్‌లో 6 ప్లాట్లు, 3 ఫ్లాట్లు, ఒక ఇల్లు పత్రాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల సాగు భూములను కూడా గుర్తించారు.














