హైదరాబాద్ అక్టోబర్ 6 (ఈతరంభారతం);మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద, మధ్యతరగతి వర్గాలపై సిటీ బస్సు చార్జీల పెంచి భారం మోపిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. .ఒక చేతితో ఇచ్చి, మరో చేతితో లాక్కోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ.రాబాద్-సికింద్రాబాద్లో సిటీ బస్సుల కనీస ఛార్జీని ఒక్కసారిగా రూ.10 పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలపై నేరుగా భారం మోపుతోంది.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బస్సు ఛార్జీల పెంపును రద్దు చేయాలని డిమాండ్ చేసారు.















