హైదరాబాద్ ఆగష్టు 25 (ఈతరం భారతం );బిసి లకు 42 శతం రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇంద్ర పార్క్ వద్ద తలపెట్టిన బీసీల సత్యాగ్రహ దీక్షకు ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకలాభరణం కృష్ణమోహన్ , బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, దూదిమెట్ల బాలరాజ్ , రాజారామ్ యాదవ్, బిఎస్ రాములు, నారగోని తదితరులు మద్దతు ప్రకటించారు. 5 వేల మంది మందికి పైగా విచ్చేసి ఇందిరా పార్క్ దద్దరిలేటట్టు సత్యాగ్రహ దీక్ష కొనసాగింది















