ఈతరం భారతం హైద్రాబాద్ మే 16 :
ఆవు “ను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు .దీనితో దేశం లో గోవధ ఆగిపోతుంది పశువుల సంపద పెరుగుతుంది కాబట్టి అవును జాతీయ జంతువుగా ప్రకటించడమే ఏకైక మార్గం అని అన్నారు.
ఈ భూమండలంలో ఆవు అంత పవిత్రమైన ప్రజలకు ఉపయోగపడే జీవి ఏదీ లేదు ఆవు ద్వారా ప్రజలకు ఎన్నో లాభాలు పాలు పెరుగు తో పాటు బహు ప్రయోజనాలు కలిగి ఉండాలి చివరకు దాని మలమూత్రలతో పాటు చనిపోయిన చెరువు కూడా మనకు ఉపయోగపడుతుంది ఆవు గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఆవు ప్రాముఖ్యత అందరూ తెలుసుకొని ఆవును ప్రతి రైతు పెంచుకోవాలి
ఆవును ఇప్పటికే మన ప్రక్క పొరుగు దేశమైన నేపాల్ 2015 లోనే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించింది మన ప్రభుత్వానికి ఎందుకు మనసు రావటం లేదని కొమ్మ ప్రేమ్ సాగర్ యాదవ్ ప్రశ్నించారు ఆవు ప్రజల మధ్యలో పకృతిలో ఉండాలి కానీ ఆవులు అంతరించిపోవడం ఈ పకృతికి చాలా హానికరం మన దేశంలో సంవత్సరానికి 50 లక్షల ఆవులు బలి కావడం తద్వారా 60 వేల కోట్ల అక్రమ వ్యాపారం చేస్తున్న దుర్మార్గుల ఆగడాలు ఎప్పుడు ఆగిపోతాయి అప్పుడే గోమాత బాగుంటే భూమాత కూడా బాగుంటుంది ప్రజలు పకృతి బాగుంటారని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు.ఆవును జాతీయ జంతువుగా ప్రకటించే వరకు విశ్రమించేది లేదు అలాగే ప్రజల మద్దతు కోరుతూ 10, లక్షల ప్రజల సంతకాలు మరియు ఐదు లక్షల పోస్ట్ కార్డులతో భారత ప్రధాని కి విన్నపాలు తెలుపుతూ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది రైతు సంక్షేమ సేవా సంఘం ఏదిఏమైనా ఈ మంచి కార్యక్రమానికి ప్రజలందరి మద్దతు కావాలని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ మనవి చేశారు














