హైదరాబాద్ ఫిబ్రవరి 25 ఈతరం భారతం:
సమాజంలో ప్రజలు తమను తాము ఎలా వ్యవస్థీ కృతం చేసుకుంటు అధికారం, వనరుల కోసం ఎలా పోటీ పడతారు మరియు సామాజిక రాజకీయ సంబంధాలను ఎలా నిర్వహిస్తారో తెలిపే విధానం కొరకు ఆవిర్భవించిన సంస్థ ది సిటిజన్స్ కౌన్సిల్ అని సంస్థ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తెలిపారు.అందులో భాగంగా వీధి విక్రేతల జీవనోపాధి రక్షణ మరియు వీధి అమ్మకాల నియంత్రణ చట్టం 2014 ప్రకారం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే ప్రజలకు ఎలాంటి అవరోధాలు లేకుండా వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు ఒకే చోట కేంద్రీకృత ప్రదేశంలో అందుబాటులో ఉండేలా, విక్రేతలు వ్యాపారం చేసుకునే ఆధునిక మార్కెట్ వ్యవస్థ కల్పించమని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేసారు. అప్పటి వరకు వీధి వ్యాపారులపై దౌర్జన్య కర పద్ధతి పాటించ వద్దని మరియు విక్రేతలు తమ వ్యాపారం ద్వారా రహదారి బాటసారులకు, కార్, ద్విచక్ర వాహన దారులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలని హితవు పలికారు.సంబంధిత విషయమై కొంత మంది వసూలు దారు తొత్తులు విపరీత ధోరణి అవలంబిస్తూ మా సంస్థ పై బురద చల్లటం చేస్తున్నారని, 2019 లో మణికొండ మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత ఏప్రిల్ 2025 వరకు చట్ట పరిధిలో లేని విధముగా తాయి బజార్ పేరిట టెండర్లు జారీ చేసి, వీధి వ్యాపారుల నుండి రుసుము వసూలు చేసి వారిని ప్రోత్సహించిన అధికారుల అడుగులకు మడుగులు వత్తిన దళారులు ఈరోజు చిరు వ్యాపారుల జీవితాలను వీధుల పాలు చేస్తున్నను గమ్మున ఉండడం విషయమై స్థానిక నివాసులు మంచి చెడు ఇంగిత జ్ఞానం కలిగి ఉన్నందు వలన ఇట్టి దళారుల మాటలకు అసలు విలువ నివ్వరణి ప్రగాఢ విశ్వాసంతొ ఉన్నామని తెలిపారు.వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తు తక్కువ ధరలకు సరుకులు అందిస్తూ తమ కుటుంబాలను పోషించుకొంటూ చట్టబద్ధ రక్షణ లేకపోవడం వలన వారు ఆర్థిక, సామాజిక ఒత్తిడికి గురవుతున్నారు. కావున వీధి అమ్మకాల నియంత్రణ చట్టం 2014 అమలు చేయడానికి వెంటనే టౌన్ వెండింగ్ కమిటీలు వేసి చట్టబద్ధత కలిగిన వెండింగ్ జోన్లు గుర్తించాలనీ, సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వ్యాపారులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వాలనీ అందె లక్ష్మణ్ రావు డిమాండ్ చేసారు.















