ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 8: మంగళ వారం
___________________________________________
ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మజ్లిస్ ఇతెహాద్ మిల్లత్ అధ్యక్షుడు తాహెర్ కమల్ ఖుంద్మీరి డిమాండ్ చేశారు. మంగళవారం హైదర్ గూడ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ పలుకుబడి, అవకతవకలు జరుగుతున్నాయనే వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇళ్లను దూర ప్రాంతాల్లో కేటాయించడం వల్ల పేదలకు రవాణా, నిర్వహణ ఖర్చుల భారం పెరుగుతోందన్నారు. అర్హతలను పునఃపరిశీలించి, జిల్లా, నియోజకవర్గాల వారీగా దరఖాస్తులు, కేటాయింపుల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, కొద్దిమందికే ఇళ్లు కేటాయించారని, కొందరు లబ్ధిదారులకు ఇప్పటికే ఇళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మిల్లత్ ప్రధాన కార్యదర్శి మజహార్ పాషా, మహమ్మద్ అబ్దుల్లా ఖబర్ తదితరులు పాల్గొన్నారు.















