EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇకపై 5 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు..

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 2:

నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. చాలా మంది రైళ్లల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ నుంచి ఓ శుభవార్త వచ్చింది. ఇక నుంచి రెండో రిజర్వేషన్ ఛార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్పుకోవచ్చు.రైల్వేలో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరడానికి 10 నుంచి 20 గంటలకు ముందు తొలి చార్ట్ ప్రిపేర్ అవుతుంది. దీని తర్వాత బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడానికి అనుమతి ఉండదు. ఒకవేళ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవాలంటే చార్ట్ ప్రిపరేషన్‌కు ముందే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఏదైనా అకస్మాత్తుగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాలన్నా, వేరే స్టేషన్‌లో ట్రైన్ ఎక్కాలన్నా ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. అయితే వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ టికెట్లకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవడానికి మరింత సమయాన్ని పెంచే అంశాన్ని రైల్వే శాఖ వర్గాలు ప్రస్తుతం పరిశీలిస్తున్నాయి. త్వరలోనే దీనిని రైల్వే అధికారులు అమలు చేయనున్నారని తెలుస్తోంది

Related News

Select the Topic
Scroll to Top