EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 14

ఈ ఫోటో చూస్తుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయాణిస్తున్న ఇద్దరు మనుషుల కంటే,తమ విజయాన్ని సమాజంతో పంచుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు హృదయాలు కనిపిస్తున్నాయి.వెండితెరపై ప్రేమకథలు ఎన్నో చూస్తుంటాం.కానీ నిజ జీవితంలో ప్రేమకు బాధ్యతను జోడించి,ఆ బాధ్యతను సేవగా మార్చడం చాలా అరుదు.పెళ్లి సందర్భంగా అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల 9వ,10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ఇచ్చిన మాటను విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నిలబెట్టుకున్నారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 180 మంది విద్యార్థులను ఎంపిక చేసి,వారి భవిష్యత్తుకు వెలుగు నింపే ప్రయాణంలో భాగమయ్యారు.

సెలబ్రిటీలు అంటే కేవలం అభిమానుల ప్రేమను ఆస్వాదించే వ్యక్తులు మాత్రమే కాదని, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తులని మరోసారి చాటి చెప్పారు.ఈ రోజు ఆ 180 మంది విద్యార్థుల ముఖాల్లో మెరిసిన చిరునవ్వులు రేపటి వారి విజయాలకు తొలి మెట్టు కావాలి.మాట ఇచ్చి మరిచిపోయే కాలంలోమాట నిలబెట్టుకోవడం కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం.చదువు మార్పును తీసుకొస్తుంది.ఆ మార్పుకు అండగా నిలిచే చేతులు మరింత గొప్పవి.

Related News

Select the Topic
Scroll to Top