EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇప్పటికే చాలాసార్లు చెప్పా..మల్లి చెపుతున్నా నేను డ్రగ్స్‌ టెస్ట్‌కు రెడీ.. కేటీఆర్‌ సీరియస్‌

హైదరాబాద్ మార్చ్ 15 ఈతరం భారతం:

డ్రగ్స్‌ మనుషులను రాక్షసులుగా మారుస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులే మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.డ్రగ్స్ వినియోగాన్ని బీఆర్‌ఎస్‌ కూడా తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఎవరైనా డ్రగ్స్‌ వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారికి ఎలాంటి రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని సూచించారు. అయితే డ్రగ్స్‌కేసును రాజకీయంగా ఉపయోగిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీని లాగడం అత్యంత దారుణమైన రాజకీయాలు అని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ కేసును బీఆర్‌ఎస్‌పై కక్ష సాధింపు చర్యలకు వాడుతున్నారని విమర్శించారు.నేను ఎప్పుడైనా డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. డ్రగ్స్‌ టెస్ట్‌కు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు చెప్పానని గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు డ్రగ్స్‌ టెస్ట్‌ చేయించుకోవాలని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చేసిన ప్రతిపాదనను స్వాగిస్తున్నానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ముందుండి ఆదర్శంగా నిలబడాలన్నారు.ఇక, ప్రతి డ్రగ్స్‌ కేసులో తన పేరును వాడటంపై కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇకపై తన పేరును డ్రగ్స్‌ కేసులో అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top