ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 14:
________________________________
తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, చేనేత కార్మికుల సంక్షేమం, గల్ఫ్ శ్రామికుల హక్కుల కోసం దశాబ్దాలుగా నిస్వార్ధంగా పోరాడుతున్న ప్రజానేత, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పద్మశాలి సంఘాలు, సమస్త బీసీ సంఘాల తరపున ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి, కాంగ్రెస్ అధిష్టానానికి పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ అధ్యక్షులు వున్న గణేష్ నేత విజ్ఞప్తిచేశారు.బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లోప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ,రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్, కౌకుంట్ల రవితేజజెల్ల జగన్నాథం, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుదర్శన్తడకయాదగిరి ,చెరుపల్లి ప్రభాకర్ , చిక్క చంద్రమోహన్ , మ్యాకం గోపాల్, కర్ణాటి విజయ్, గజం జగదీష్ లతో కలిసి మాట్లాడారు.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియమించబడే వ్యక్తికి సహకార రంగం, ప్రజాసేవ, కార్మిక సంక్షేమ రంగాలలో విశేషమైన అనుభవం, సేవ ఉండాలి. ఈ అర్హతలన్నింటికీ తిరుగులేని నిదర్శనం అనిల్ ఈరవత్రికి ఉన్నాయని తెలిపారు.
అనిల్ ఈరవత్రి గారికి మద్దతు ఎందుకు?
గత బీ ఆర్ ఎస్ పదేళ్ల పాలనలో చేనేత ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలను పూర్తిగా పక్కనబెట్టి, సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ప్రజా ప్రభుత్వం రాగానే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా నిరంతరం కృషి చేసింది అనిల్ ఈరవత్రి అని తెలిపారు.అంతే కాకుండా అఖిల భారత పద్మశాలి మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించి, ముఖ్యమంత్రి ని స్వయంగా రప్పించి నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు.ఇప్పటివరకు ముఖ్యమంత్రులు పద్మశాలి మహా సభలకు వచ్చిన దాకలాలు లేవు అనిల్ ఈరవత్రి పట్టుదల వల్లే మార్చ్ 09 2025 న జరిగిన పద్మశాలి మహా సభలో మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపాల్గొన్నారన్నారు.ఆ ఫలితంగానే గత ప్రభుత్వం లో చేయలేనటువంటి చేనేత రుణమాఫీ, బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ. 49 కోట్ల చేనేత రుణమాఫీ అమల్లోకి వచ్చింది. నిలిచిపోయిన రూ. 290 కోట్ల ‘చేనేత చేయూత’ బకాయిల విడుదల సాధ్యమైంది.
ఈ నిర్ణయాలు అమలై వేలాది నేతన్నల ఇళ్లలో వెలుగులు నిండటంలో అనిల్ ఈరవత్రిగారు చేసిన నిరంతర సంప్రదింపులే మూలకారణమన్నారు.
జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేయించడంలో అనిల్ గారు కీలక భూమిక పోషించారు. గల్ఫ్ కార్మికుల కష్టాలను గత BRS ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇటువంటి పాలసీ దేశంలో ఎక్కడ అమలులో లేదు. సిరిసిల్ల సభలో స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే బహిరంగంగా పేర్కొంటూ- “గల్ఫ్ కార్మికుల కష్టాలను గుర్తించి, వారి సంక్షేమం కోసం ఒక బలమైన విధానం రావడంలో అనిల్ ఈరవత్రి పాత్ర అత్యంత కీలకమైనది” అని కొనియాడారు.తెలంగాణలో ఎక్కడ బడుగు, బలహీన వర్గాలపై అన్యాయం జరిగినా మొదటి వరుసలో నిలిచే నాయకుడు ఆయన. చట్టసభలలో మాట్లాడే అపారమైన అనుభవం, సంక్షేమ పథకాలు, నిధులు సాధించిన స్పష్టమైన ట్రాక్ రికార్డు ఆయనకున్నదని తెలిపారు.















