ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 14:
________________________________
తెలంగాణలో కొత్త బార్ లైసెన్సుల కోసం మద్యం వ్యాపారులు భారీగా పోటీ పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ నోటిఫై చేసిన 41 కొత్త బార్లకు రికార్డు స్థాయిలో 8,771 దరఖాస్తులు వచ్చాయి. దీనితో ప్రభుత్వ ఖజానాకు ఫీజుల రూపంలో రూ.87.71 కోట్ల ఆదాయం సమకూరింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని క్యూర్ ప్రాంతంలో 14 బార్లకు 4,252 దరఖాస్తులు వచ్చాయి. మొయినాబాద్లో రెండు బార్లకు అత్యధికంగా 664 దరఖాస్తులు రాగా, బోధన్లో అత్యల్పంగా 19 దరఖాస్తులు నమోదయ్యాయి. త్వరలో లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా బార్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.















