హైదరాబాద్ ఆగష్టు 19 (ఈతరం భారతం); ఈ నెల 21 న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియ యునివర్సిటీ కి వస్తున్న నేపద్యం లో తెలంగాణ నిరుద్యోగుల చలో ఉస్మానియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు బొల్క వెంకట్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపు నిచ్చారు.తెలంగాణ బొడ్రాయి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతోమంది మేధావులను ఉద్యమకారులను తయారు చేసినటువంటి ఉస్మానియా గడ్డమీద ఆంధ్ర దోపిడిదారులకు వత్తాసు పలుకుతూ ఓటుకు నోటు కు సంచులు మూసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన గుంపు మేస్త్రి ఇక్కడ ఉన్న మేధావులకు యువతకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు.ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని ఎందుకు కా?నిరుద్యోగ భృతి ఇవ్వనందుకా?తెలంగాణ వచ్చినాక మూతపడ్డ బడులు తెరవనందుకా? ఫీజు రీయింబర్స్ ఇవ్వనందుకా? తెలంగాణ వచ్చినాక విద్యాలయాల్లో గంజాయి అడ్డాలుగా తయారు చేసినందుకు కా? అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా చెప్పులతో చీపురులతో NCC గెట్ నుండి స్వాగతం పలకనున్నట్లు ఆయన తెలిపారు.















