ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 19 :మోండా మార్కెట్ లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ నాయకులు కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్ లో రోడ్డు పై పార్కింగ్ విషయంలో ఎస్.కె జూలరి యజమాని, అతని అనుచరులు కలిసి సాయికుమార్ పై దాడి చేయడం దుర్మార్గం అన్నారు. దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. బందులో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.మార్వాడి, రాజస్థాన్, గుజరాతీలు తెలంగాణకు వలస వచ్చి తెలంగాణ ప్రజల మీద పెత్తనం సాగిస్తున్నారని మండిపడ్డారు. మన దగ్గర మన మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు మన మీద దాడి చేయడం ఏంటని మండిపడ్డారు. జ్యువలరీ, హార్డ్వేర్, కిరాణా, ఎలక్ట్రిక్, స్వీట్, మొబైల్ షాప్ పారిశ్రామిక రంగంలో కూడా విస్తరించి తెలంగాణలో నాసిరకం వస్తువులు విక్రయిస్తూ కోట్లల్లో లాభాలు గడిస్తూన్నారని తెలిపారు. తెలంగాణ కుల వృత్తులను కనుమరుగయ్యేలా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు అలాంటి తెలంగాణను ఎక్కడినుండో వలస వచ్చిన రాజస్థాన్, గుజరాతీలు తెలంగాణ సంస్కృతిని అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. 60 సంవత్సరాలు ఆంధ్ర పెత్తందారుల నుంచి తెలంగాణ కాపాడుకుంటే ఇప్పుడు మార్వాడీలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్వాడి షాపుల్లో వస్తువులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మార్వాడీ వ్యాపారాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. వెంటనే మార్వాడీలు తెలంగాణను విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దరువు రమేష్, రమేష్, రాజేందర్, శివాజీ, చరణ్, అరుణ్, కుమార్, జలంధర్, రాజు, శ్రీనివాస్, రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.















