ఈతరం భారతం హైదరాబాద్, ఏప్రిల్ 21:
శ్రీశ్రీ సగర భగీరథ మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. మంగళవారం హైదరాబాదులోని బిసి భవన్ లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ ఆచారి, ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్వ జీవకోటి ప్రాణాధారమైన గంగాను తన కటోర తపస్సుతో దివి నుంచి భువికి తీసుకువచ్చిన మహాత్ముడు శ్రీ భగీరథుడు అని అన్నారు. మహర్షి భగీరథ జయంతిని దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. ఈనెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న భగీరథ జయంతి ఉత్సవాలలో అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా బీసీ కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉత్సవాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ ఆచారి, ఉప్పరి శేఖర్ , కుల్కచర్ల శ్రీనివాస్, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ, తెలంగాణ సగర సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, దిండి శేఖర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంగమ అధ్యక్షులు మూడేళ్ల రవి సగర, రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు గుంటి కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.















