ఈ నెల 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణ
ఈతరం భారతం హైదరాబాద్ తెలంగాణ నవంబర్ 16:
ఈ నెల 30న కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఎస్ఎస్ఆర్–2026 ప్రక్రియలో భాగంగా, అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఇప్పటివరకు 54,863 మందిని అనర్హులుగా గుర్తించారు. ఆగస్టు 17న ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాత, 2.63 కోట్ల మంది ఓటర్లను తుది జాబితా కోసం అర్హులుగా ఎన్నికల సంఘం ధ్రువీకరించింది. ఇంకా కొందరి విషయంలో విచారణ కొనసాగుతోంది. అనర్హతకు గల కారణాలను స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా అధికారులు వెల్లడించనున్నారు.















