EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉత్సాహంగా ఫిట్ ఇండియా సండేస్ అన్ సైక్లింగ్

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 7 :

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సండేస్ అన్ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించిన సైకిల్ ర్యాలీకి నగరంలోని సైక్లిస్టుల నుండి అద్భుత స్పందన లభించింది.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివ ప్రతాప్ శూక్ల జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయష్ రంజన్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి డాక్టర్ సోనీ బాలదేవి తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో విస్తృతస్థాయిలో నిర్వహిస్తున్నరని, రాష్ట్రంలో అద్భుతమైన క్రీడా ప్రతిభ ఉందని గవర్నర్ శ్రీ శివప్రసాద్ అన్నారు. విస్తృత స్థాయిలో వివిధ క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖను ఆయన అభినందించారు. ఇందులో పాల్గొన్న ప్రతి సైకిలిస్టుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరఫున సర్టిఫికెట్, మెమెంటోలు అందజేశారు.

Related News

Select the Topic
Scroll to Top