ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 20.: శుక్రవారం మధ్యాహ్నం లక్డికాపూల్ లోని రవీంద్రభారతిలో శ్రీ శాంతిక్రిష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ వారి సౌజన్యంతో విశ్వకళావైభవం 1113వ అంతర్జాతీయ సంస్కృతిక సంబర మహోత్సవంలో భాగంగా పురస్కారాలను ప్రదానంచేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ శాసన మండలి విపక్ష నేత, తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ శ్రీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ చైర్మన్ శ్రీ పద్మాచారి ఓ చిచ్చరపిడుగు. ఉద్యోగులకు ఎక్కడ సమస్య ఎదురైనా, ఎలాంటి అన్యాయం జరిగినా… ఎదుటివారు ఎంతటి శక్తివంతులైనా ఎదురించి ఢీ అంటే ఢీ అని పోరాడి సమస్యను పరిష్కరించే యోధుడు పద్మాచారి గారని సిరికొండ మధుసూదనాచారి ప్రశంసించారు.తెలంగాణ ఉద్యోగులు అన్నా అని పిలిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు నేనున్నా అనే పద్మన్న తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఉండటం ఉద్యోగులకు గర్వకారణమని మధుసూదనాచారి పేర్కొన్నారు.పద్మన్న, నేను తెలంగాణ ఉద్యమంలో చాలా ఏళ్లుగా కలిసి పోరాటం చేసినం. సమస్యలు పరిష్కరించేటువంటి కేంద్ర స్థానం సచివాలయం. ఆ సెక్రటేరియట్ ఉద్యోగులకు సమస్యలు ఎదురైతే పరిష్కారం చూపెట్టే వ్యక్తి… దటీజ్ పద్మాచారి. గౌరవ పద్మాచారి గారికి ఈ పురస్కారానికి ఎంపిక చేయడాన్ని పూర్తిగా అభినందిస్తున్నానని సిరికొండ మధుసూదనాచారి నిర్వాహకులను కొనియాడారు.అనంతరం ఎ.పద్మాచారి కి,. డా. కె. సుందర తిరుమలచార్యులకు హైదరాబాద్ జిల్లా ఆర్డీఓ ఇ. వెంకటాచార్యులు పురస్కారాలను సిరికొండ మధుసూదనాచారి ప్రదానం చేశారు.
కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీ శాంతి క్రిష్ణ, వ్యాఖ్యాత శ్రీ సయ్యద్ మక్దూం మొహియుద్దీన్, గౌరవ అతిథులుగా సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞశర్మ, ఏసీపీ కిరణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ డెజిగ్నేట్ అడ్వకేట్ శ్రీ విరోజ్ రఘునాథ్, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీ పెందోట శ్రీనివాస్, శ్రీ డా. నాగార్జున, ఐజీ (రిటైర్డ్) శ్రీ గుణశేఖర్ రెడ్డి, శ్రీ పల్లె నాగేశ్వరరావు, శ్రీ నందకిశోర్, సినీ నిర్మాత శ్రీ రమేష్ రాజా సహా తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.















