EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదల

హైదరాబాద్ జూలై 22 (ఈతరం భారతం);రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టెట్ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి.పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరు కాగా, పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికిగానూ 41,207 మంది(76.73 శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top