హైదరాబాద్ ఫిబ్రవరి 21 ఈతరం భారతం:
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి పోలీసులు చేరుకున్నారు. . ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. – ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ప్రజలు సహించరు. హింసను క్షమించరు. – కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ బలపడడం జీర్ణించుకోలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. – కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గం.- దీనికి పూర్తి భాద్యత సీఎం రేవంత్ రెడ్డి వహించాలి. – మేము వెంకటరమణ రెడ్డి గారికి, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటాము అని అన్నారు.















