EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎబివిపి 48 గంటల నిరసన దీక్ష విరమణ

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 25

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రను తిప్పి కొట్టాలనే ఉద్దేశంతో సికింద్రాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పీజీ కాలేజీ లో 48 గంటల నిరసన దీక్ష రెండవరోజు విజయవంతంగా కొనసాగింది.నిరసన దీక్ష తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డా:N జానారెడ్డి రావడం జరిగింది… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయులు పెండింగ్ లో ఉన్నాయని , ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు నెంబర్స్ మెంట్ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 2500 కోట్లు కేటాయిస్తే అనగా బడ్జెట్లో 0.77 శాతం నిధులు కేటాయిస్తే సరిపోతుందని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల ఆసక్తి కనపడుతూ లేదని , ఇవి విద్యార్థుల బిక్ష కాదు విద్యార్థుల హక్కు. అని ఇప్పటికైనా ప్రభుత్వం ముద్దు నిద్ర వేడి తక్షణం పెండింగ్ లో ఉన్న విద్యార్థుల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థి జీవితాలు మారడం లేదని, గౌరవ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు తగిన రీతిలో ప్రభుత్వం తరఫునుండి తగు రీతులు నివేదిక సమర్పించి ఈ యొక్క ఫీజు రీమార్చ్మెంట్ పథకాన్ని కొనసాగించి తెలంగాణ విద్యార్థి సమాజానికి తగిన న్యాయం చేయాలని కోరారు.

సికింద్రాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో చేసిన 48 గంటల నిరసన దీక్షకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రావుల కృష్ణ తో కలిసి మద్దతు తెలిపిన అనంతరం దీక్షను విరమింపజేయడం జరిగింది…

Related News

Select the Topic
Scroll to Top