ఈతరం భారతం హైదరాబాద్ జూలై 31 :తెలంగాణాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటినన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది. ఈ అంశంలో తెలంగాణా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న వినతి సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.















