EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎస్కార్ట్స్ నుంచి వరి సాగు కోసం ప్రత్యేక ‘శౌర్య’ ట్రాక్టర్ విడుదల

హైదరాబాద్, మార్చి 24 ఈతరం భారతం:

వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ పవర్ ట్రాక్ శౌర్య పేరుతో కొత్త ‘సౌత్ స్పెషల్’ వరి ట్రాక్టర్ సిరీస్‌ను విడుదల చేసినట్లు ఎస్కార్ట్స్ కుబోటా చైర్మన్, ఎండీ నిఖిల్ నందా మంగళవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్కార్ట్స్ కుబోటా చైర్మన్, ఎండీ నిఖిల్ నందా మాట్లాడుతూ ఈ సిరీస్‌లో 39 హెచ్‌పి నుండి 52 హెచ్‌‌పీ విభాగాలలో ఐదు వేర్వేరు రకాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. డెప్యూటీ ఎండీ అకిరా కాటూ మాట్లాడుతూ భారత దేశంలో ఎస్కార్ట్స్ కుబోటా సంస్థ కుబోటా, ఫామ్‌ట్రాక్, పవర్‌ట్రాక్ అనే మూడు బ్రాండ్‌ల పేరుతో ట్రాక్టర్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. హోల్ టైమ్ డైరెక్టర్, సీఎఫ్ఓ భరత్ మదన్ మాట్లాడుతూ ఇది తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని వరి సాగు ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్ట మొదటి వరి, మాగాణి ప్రత్యేక సిరీస్ అన్నారు. బిజినెస్ డివిజన్ చీఫ్ ఆఫీసర్ నీరజ్ మెహ్రా మాట్లాడుతూ ఈ ఆవిష్కరణ ద్వారా కీలకమైన వ్యవసాయ యాంత్రీకరణ విభాగంలో కంపెనీ తన ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. పవర్ ట్రాక్ బ్రాండ్ ద్వారా ఈ రకమైన ప్రత్యేక శ్రేణిని పరిచయం చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top