ఈతరం భారతం హైద్రాబాద్ ప్రతినిధి మహేషుని లక్ష్మయ్య మే 8:
ఇటీవల పార్లమెంటులో బిల్లు వీగిపోవడాని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కాన్ఫరెన్స్ హాల్ సూర్య లోక కాంప్లెక్స్ అబిడ్స్ హైదరాబాద్ లో జరిగిన ఓ మహిళా మేలుకో నీ గమ్యం చేరుకో కార్యక్రమాన్ని శ్రీమతి ఉదయలక్ష్మి గారు నిర్వహించగా ముఖ్యఅతిథిగా పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ శ్రీ నారగొని , గౌరవ అతిధులుగా పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బాలకృష్ణ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కె. బి .శ్రీధర్, మహిళా విభాగం భాగం జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అంజలి దేవి, ఏపీ అధ్యక్షుడు శివ శంకర్ రెడ్డి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ నాదెండ్ల సుధాకర్ తెలంగాణ మహిళా ప్రెసిడెంట్ డాక్టర్ పద్మిని అడ్వైజర్స్ చిత్ర దేవసేన యువజన విభాగం జనరల్ సెక్రెటరీ నవీన్ మహిళా నాయకురాలు అనసూయమ్మ మాతృదేవోభవ సత్సంగ్ రెండు రాష్ట్రాల సెక్రటరీ విజయ కనకదుర్గ సామాజికవేత్త నాగభూషణం పాల్గొన్నారు .ఈ సందర్భంగా త్వరలోనే ఓ మహిళ మేలుకో నీ గమ్యం చేరుకో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు సభ తీర్మానించింది














