ఈతరం భారతం హైద్రాబాద్ మే 1
కేంద్రప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం పై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.ఇది సామాన్యుడిపై పెనుభారం మోపే నిర్ణయం అని ఆయన దుయ్యబట్టారు.19 కేజీల గ్యాస్ ధరను 993 రూపాయలకు అంటే సుమారు 1000 రూపాయలకు పెంచడం పై శుక్రవారం రోజు ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు.ఒక్కసారిగా 30 నుండి 35 శాతం పెంచడంతో హోటళ్లు,కేఫ్ లు రెస్టారెంట్లతో సహా చిన్న తరహా వీధి వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్ఛిమబెంగాల్ ఎన్నికలు ముగిసిన 24 గంటలు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఎద్దేవా చేశారు.ముమ్మాటికీ ఇది ప్రజలను మోసం చేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని పచ్ఛిమ బెంగాల్ ఎన్నికలు పూర్తి కాంగానే కమర్షియల్ గ్యాస్ ధర పెంచడం అంటే సామాన్యులను మోసం చేయడమే నని ఆయన విమర్శించారు.
కేంద్రం పెంచిన ధరలతో 19 కే జీ ల గ్యాస్ ధర మూడువేలకు మించి పోయిందన్నారు.కమర్షియల్ గ్యాస్ ధర పెంపుతో సామాన్యుల జీవన ప్రమాణాలపై కోలుకోలేని దెబ్బ పడుతుందని ఆయన చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ధరల పెంపు నిర్ణయాన్ని ఉప సంహారించుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.














