హైదరాబాద్ ఫిబ్రవరి 19 ఈతరం భారతం:
కర్రెగుట్టలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఆపరేషన్-2 కగార్ పేరుతో కర్రెగుట్టలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలు, మావోయిస్టుల మద్య ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినటట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. బుధవారం మావోయిస్టు అగ్ర నేతలే టార్గెట్‌గా భద్రతా బలగాలు ఆపరేషన్-2 కగార్ ప్రారంభించాయి. దాదాపు ఐదు వేల మంది సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో హోంమంత్రి అమిత్ షా, 2026 మార్చి చివరికల్లా మావోయిస్టులను అంతమొందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమిత్ షా డెడ్ లైన్ దగ్గరపడుతుండటం నేపథ్యంలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ కు సిద్ధమయ్యారు.















