EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కవి రాజు విజేత

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 4

తెలుగు భాషా సంరక్షణే ధ్యేయంగా, అక్షర నీరాజనాలు పలుకుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవి హృదయాలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న సంస్థ విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “కనిపించని గాయం” కవితల పోటీలో ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు విజేతగా ముందు వరుసలో నిలిచారు.సమాజంలోనూ, మనుషుల మనసుల్లోనూ దాగి ఉన్న అనేక అంతర్మథనాలను, కంటికి కనిపించని సామాజిక మరియు వ్యక్తిగత గాయాలను తన కలం ద్వారా అక్షర రూపంలో ఆవిష్కరిస్తూ డా. పెరుక రాజు రచించిన కవిత విశేషంగా ఆకట్టుకుంది.

ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, సాహిత్యాభిలాషుల నుంచి విశేష స్పందన లభించింది. అందిన వందలాది కవితల్లో భావతీవ్రత, శైలి, వస్తువు యొక్క ప్రాధాన్యత, సాహిత్య విలువలను ప్రమాణాలుగా తీసుకొని విజేతలను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు ప్రతిభను అభినందిస్తూ, విశ్వ సాహితీ కళావేదిక అధ్యక్షురాలు శ్రీమతి కె. రమావతి గారు మరియు కార్యవర్గ సభ్యులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి అభినందన పత్రాన్ని అందజేశారు.జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీలో విజేతగా నిలిచిన డా. పెరుక రాజుకు పలువురు సాహితీవేత్తలు, ఆత్మీయ మిత్రులు, అభిమానులు అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top