ఈతరం భారతం హైద్రాబాద్, మే 16 :
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సమీకృతఅంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక సారస్వత సంఘం తన 32 వ వార్షిక వేడుకలు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథి పాల్గున్న వంశీ ఇంటర్నేషనల్ సంస్థ అధినేత శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ…. ఐదు దశాబ్దాలకు పైగా మానస సాహితీ సంస్థ అధినేత గా, జంటనగరాల ఆనేక కవి సమ్మేళనం కార్యక్రమాలకు సంధాన కర్తగా, తెలుగు సాహితీ రంగం ఉన్నతి కి కవి రఘు శ్రీ దోహదపడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కవి రఘుశ్రీ ని వంశీ రామరాజు ఘనంగా సత్కరించి, ఇట్కాలా సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. సభకు అధ్యక్షత వహించిన ఇట్కాలా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అంతర్జాతీయ సేవా మూర్తి, సంస్కృతిరత్న డాక్టర్ కే.ధర్మారావు మాట్లాడుతూ కవి రఘు శ్రీ తెలుగు సాహిత్యానికి దశాబ్దాలుగా చేస్తున్న సేవలకు తాను ప్రత్యక్ష సాక్షినని, ఆయన మరెన్నో కార్యక్రమాల ద్వారా భావి తర సాహితీ స్రష్ట లకు స్పూర్తి వంతం అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే పెన్షనర్ల జాతీయ కార్మిక నేత, సేవారత్న పీ.యుగంధర్, Hసత్యసాయి మెడికల్ క్యాం పుల సంథాన కర్త కే.వీ.భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇట్కాలా సాహితీ పురస్కార గ్రహీత కవి రఘుశ్రీ మాట్లాడుతూ తాను నిస్వార్థంగా తెలుగు సాహిత్య రంగానికి సేవలను కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నానని అన్నారు. ఈ అవార్డు అందుకోవడం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందని కవి రఘుశ్రీ చెప్పారు.














