EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాంగ్రెస్ కు, ఆర్జేడికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదు

హైదరాబాద్ ఆగష్టు 23 (ఈతరం భారతం);: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్జేడికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిహార్ ఎన్నికల్లో మంచి వాతావరణం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నరో ఆయనకే తెలియదని విమర్శించారు. ఇల్లీగల్ ఓట్లు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యనే.. బిహార్ లో ఇల్లీగల్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, తెలియజేశారు.హిమాచల్, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని, దొంగఓట్లతోనేనా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తీవ్రమైన నేరాల్లో ఉన్న సిఎం, మంత్రులు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ దర్యాప్తు జరగాల్సిందేనని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాసిందని, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? అని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

 

Related News

Select the Topic
Scroll to Top