EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో వాదనలు వినిపించాలి        బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్ అక్టోబర్ 6 (ఈ తరం భారతం );తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.హైకోర్టులో అదే అంశంపై కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు, ముందుగా హైకోర్టులో వాదనలు వినిపించాలి అని చెప్పడం సహజ ప్రక్రియ అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుఅన్నారు. అయితే కాంగ్రెస్ మంత్రులు పెద్ద హడావుడి చేసి ఏదో సాధిస్తామంటూ తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లారు.దీనిపై రాజకీయంగా ప్రయత్నిస్తూ, “ఏదో సాధించాం” అని కాంగ్రెస్ నాయకులు చెప్పడం విడ్డూర మన్నారు.కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హైకోర్టులో న్యాయనిపుణులతో వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.సుప్రీంకోర్టులో డిస్మిస్ కావడానికి కారణం హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం మాత్రమే.బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని బిజెపి మొదటినుండి కోరుతోంది. అందుకు మద్దతు ఇచ్చాం, కట్టుబడి ఉన్నామన్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపికకు అభిప్రాయాలు సేకరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశా మన్నారు.ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, కోమల ఆంజనేయులు ఉన్నారు.కమిటీ ద్వారా పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసి ప్రకటిస్తాం.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి విజయం సాధించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.

Related News

Select the Topic
Scroll to Top