EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కామంతో కళ్లుమూసుకుపోయి.. మైనర్‌ అఘాయిత్యం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు!

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 26 :

ఇటీవల కాలంలో మానవత్వం మరిచిన కామాంధులు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. మైనర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితుడికి పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడున్నరేళ్ల క్రితం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు మహమ్మద్ ఖయ్యూంకు 51జైలుశిక్ష విధించింది కోర్టు.నల్లగొండ జిల్లా తిప్పర్తి మోడల్ స్కూల్లో ఓ మైనర్ బాలిక పదవ తరగతి చదువుతోంది. తిప్పర్తికి చెందిన మమ్మద్ ఖయ్యూం.. ప్రేమ పేరుతో బాలికను వేధింపులకు గురి చేశాడు. నవంబర్ 3, 2021న బస్ స్టాప్ వద్ద ఉన్న మైనర్ అమ్మాయిని షేక్ మహ్మద్ ఖయ్యూం బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని పాడుబడ్డ ఇంట్లోకి లాక్కెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్ డిసెంబర్ 5,2021 న వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఖయ్యూంపై నమోదు చేశారు. 2022 నుండి పోక్సో కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. దీంతో నిందితుడికి 51 ఏళ్ల శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top