EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కులగణనసర్వేలో పాల్గొనని కిషన్ రెడ్డి ,కెసిఆర్ కుటుంబ సభ్యులకు బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు లేదు  

హైదరాబాద్ జూలై 28 (ఈతరం భారతం);తెలంగాణలో కులగణన కోసం జరిపిన ఇంటింటి సర్వేలో పాల్గొనని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ మరియు కెసిఆర్ కుటుంబ సభ్యులకు తెలంగాణ స్థానిక సంస్థల 42శాతం బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడే హక్కు ఎక్కడిదో స్పష్టం చేయాలని నేషనల్ ఓ బి సి ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ,విశ్రాంతి చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వారి నోటి వెంట 42 శాతం బీసీ రిజర్వేషన్లు పై వచ్చే వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని, ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ మరియు దేశ అత్యున్నత నాయకులు సమక్షంలో తెలంగాణ లో అగ్రవర్ణ పేదలకు ఇచ్చే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు విషయంలో 9.59% ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లా అని ప్రశ్నిస్తూ, తెలంగాణలో అగ్రవర్ణాలందరూ పేదలేనా అని ప్రశ్నించిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారిని అభినందిస్తూ ,ఇంత ముఖ్యమైన విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని ఒక ప్రకటనలో ఆళ్ల రామకృష్ణ తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top