ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 17
యేసుప్రభు మళ్లీ బతికిస్తాడనే నమ్మకంతో శవంతో నాలుగు రోజుల పాటు ఇంట్లో ప్రార్థనలు చేసిన ఓ కుటుంబం.కైకలూరుకు చెందిన ఓ కుటుంబం వివేకానందనగర్ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులోని అద్దె ఇంట్లో ఉంటోంది.తల్లి శమంతకమణి, ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో కలిసి నివసిస్తోంది. పిల్లలు ముగ్గురికీ వివాహం కాలేదు. ఇటీవల అనారోగ్యంతో కుమార్తె శైలజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి తలుపుకు తాళం వేసుకుని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పలు విధాలుగా వారికి నచ్చజెప్పడంతో చివరకు వారి సొంత ఊరికి అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు.















