EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కెసిఆర్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: తీన్మార్ మల్లన్న

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 17 :బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ అరాచకం బయటపడిందని లేకపోతే ఇప్పటికీ అది కొనసాగేదేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.సామాన్యులను మావోయిస్టులుగా ముద్ర వేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కేసీఆర్ తో పాటు ఈ నేరానికి పాల్పడిన వారందరికీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో ఇవాళ మల్లన్న విచారణకు హాజరయ్యారు. మల్లన్న వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన మల్లన్న.. నాతో పాటు అనేక మంది ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని చివరకు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశానని మరికొంత సమాచారం ఉందని అది త్వరలోనే అధికారులకు పంపిస్తానన్నారు. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారన్నారు.అధికారాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ చేసిన అన్ని దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అతి పెద్ద దుర్మార్గం అన్నారు. వ్యక్తిగత హక్కులను హరించిన కేసీఆర్ కుటుంబంపై నాటి అధికారులపై చర్యల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో బాధితుడేనని గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు ఈ ప్రభుత్వంలో జరగవనే సంకేతాలు ప్రజలకు ముఖ్యమంత్రి ఇవ్వాలన్నారు. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని ముందే కోరబోమని సిట్ ఏ మేరకు న్యాయం చేయగలదో చూస్తామన్నారు. ముందుగానే సిట్ ను బద్నాం చేయడం ఎందుకు అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top