ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 2
బీపీసీఎల్ ఇప్పుడు తమ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. పాత ఇనుప గ్యాస్ సిలిండర్లను ఇచ్చి, కేవలం రూ.300కే కొత్త ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు.ఈ కొత్త సిలిండర్లు 120 కిలోల ప్రెజర్ వరకు తట్టుకుంటాయి, ఇవి బ్లూ, ఎల్లో రంగుల్లో లభిస్తాయి.వీటిలో గ్యాస్ లెవల్ ఎంత ఉందో సులభంగా చూసుకోవడానికి ఒక కిటికీ లాంటిది ఉంటుంది.ప్లాస్టిక్తోతయారైనందున తుప్పు, మరకల సమస్య ఉండదు. ఈ సిలిండర్ అసలు ధర రూ.3,350 అయినప్పటికీ, పాత సిలిండర్ మార్పిడికి రూ.300 మాత్రమే వసూలు చేస్తున్నారు.















