ఈతరం భారతం హైదరాబాద్ జూలై 13 :సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మాజీ సీఎం కేసీఆర్ విజన్‌కు మరో జీవన లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.పరిపాలన అంటే శంకుస్థాపనలు చేయడం మాత్రమే కాదని.. అభివృద్ధి, ప్రగతి అంటే రాజకీయ హంగులు ఆర్భాటాలు ఏమాత్రం కాదని సూచించారు. నిజమైన నాయకుడు ఒక తరం లేదా ఒక ఎన్నిక గురించి మాత్రమే ఆలోచించడని, తరతరాలపాటు రాష్ట్రానికి ప్రయోజనాలు కలిగించే ప్రణాళికలే నిజమైన నాయకుడి విజన్ అని పేర్కొన్నారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా రెండు అద్భుత ఫలితాలను తెలంగాణ నేడు సాధించిందని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మోటార్లు ఆన్ కావడంతో ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. అలాగే, యాదాద్రి దామరచర్ల అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌లోని యూనిట్ వన్ 72 గంటల కోడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు.















