హైదరాబాద్ జూలై 18 (ఈతరం భారతం);కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కేటీఆర్..వేరు వేరుగా లోకేష్..జగన్ తో రహస్య భేటీ బీజేపీ డైరెక్షన్ లో ఓ ఫామ్ హౌజ్ లో భేటీ జరిగిందని దీనిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేసారు.ఎం రేవంత్ మీలాగా సాటు మాటు మీటింగులు పెట్టడు సాటు కి సంసారం చేసిది మీరు..బురద జల్లేది మా పైనా..?అని ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం గాంధీ భ్జవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ పదేళ్లలో కెసిఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు . అందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కి పట్టం గట్టారు. . పదేళ్లలో కేసీఆర్ సచివాలయం రాలేదు .. ప్రజల మధ్య తిరగలేదు డిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని కలిసింది లేదు కేసీఆర్ . అధికారం పోయే సరికి.. షాక్ లో ఉన్నారు. పదేళ్లు రాజభోగాలు అనుభవించి… ఇప్పుడు లేకపోయేసరికి షాక్ లో ఉన్నారు . సీఎం రేవంత్..కేంద్రం తో నిధులు సమకూర్చుకోవాలి.సీఎం గా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చడం తప్పా..? . సీఎం తో పాటు ఉత్తం..శ్రీధర్ బాబు కూడా ఉన్నారు బిఆర్ఎస్ వాళ్లకు కళ్ళు దొబ్బినయా..? అని ప్రశ్నించారు. కండ్లు కనపడటం లేదనిపిస్తుందిమీకు బాధ్యత లేదు… బరువు లేదుమాపై ప్రజలు పెట్టిన బరువు..బాధ్యతలు తీర్చే పనిలో ఉన్నాం మీరు ఫార్మ్ హౌస్ లో పడుకున్నారు అని…మమ్మల్ని కూడా ఫార్మ్ హౌస్ లో ఉండాలి అంటారా..ఏంది అని ప్రశ్నించారు















