EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

క్రియేటర్లు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి ఎస్సీ, ఎస్టి, గిరిజన, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైద్రాబాద్ జులై 24 (ఈతరం భారతం)క్రియేటర్లు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టి గిరిజన, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. ఏఐజి డెవలప్‌మెంట్ సహకారంతో మరియు కళారాజ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో టీఎస్ ఎఫ్ఏ 2025 సామాజిక, సినీ రంగాలలో విశిష్ట సేవలందించిన క్రియేటర్లకు అవార్డులను ప్రధానం చేశారు . కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రముఖులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. క్రియేటర్లు కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని, ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సినీ రంగానికి కళారాజ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఏఐజి డెవలప్‌మెంట్ చైర్మన్ మొహమ్మద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. టీఎస్ఎఫ్ఏ 7వ ఎడిషన్‌ను ప్రారంభించడం తనకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.ప్రపంచ సృజనాత్మక సహకారానికి చిహ్నం అని అభివర్ణించారు. ఏఐజి దీర్ఘకాలిక విజన్ ను వివరించారు. టీఎస్ఎఫ్ఏ అందిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related News

Select the Topic
Scroll to Top