EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

క్రీడా కార్యక్రమాల్లో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలి జాతీయ క్రీడ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

హైదరాబాద్ ఆగస్టు 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );శనివారం నుండి తొమ్మిది రోజులపాటు జాతీయ క్రీడా ఉత్సవాలలో క్రీడాకారులు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి క్రీడా శాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో కలిసిక్రీడా శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించినంత ఉత్సాహభ రితంగా జాతీయ క్రీడ వేడుకలను 9 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దానికి అనుగుణంగా అందరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు . ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన క్రీడా విధానము అంశాలను క్రీడా. సమాజానికి చేరువయ్యే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు విద్యాసంస్థలు క్రీడాకారులు క్రీడాభిమానులు యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లాల లో కూడా జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామీణ క్రీడా మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆయన కోరారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్న అకాడమీలు స్పోర్ట్స్ స్కూల్ లను బలోపేతం చేయాలని, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానాలలో శిక్షణ పొందుతున్న రెగ్యులర్ ట్రైని లలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. క్రీడారంగం బలోపేతం కావాలి అంటే పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లు మరియు కోచుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని, క్రీడా శాఖ విద్యాశాఖ మధ్య సమన్వయం తో గ్రామీణ స్థాయి నుండి అంచలంచలుగా క్రీడాభివృద్ధికి కృషి జరగాలని ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top