ఈతరం భారతం హైదరాబాద్
గాంధీ భవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు సంఘిశెట్టి జగదీశ్వర్ రావు జన్మదిన వేడుకలు టీ పీ సీ సీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, టీ పీ సీ సీ సోషల్ మీడియా సిబ్బంది, గాంధీ భవన్ సిబ్బంది అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ, ప్రజల సమస్యలపై గళ మెత్తుతున్న జగదీశ్వర్ రావు గారు కాంగ్రెస్ పార్టీకి బలమైన స్వరం అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కోసం చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లో టీ పీ సీ సీ ఉపాధ్యక్షులు కుమార్ రావు , తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ వైస్ చైర్మన్ అల్లాం భాస్కర్ , కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు సప్పిడి భాస్కర్, మరియు సప్పిడి అఖిల్ తదితరులు పాల్గొన్నారు














