ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 13 :ఆగష్టు 15వ తేదీన జరిగే స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన ప్రముఖలు ఆయా జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.ఈ మేరకు సీఎస్రామకృష్ణారావు జిల్లాల్లో ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని గోల్కొండ కోటలోని రాణి మహాల్ దగ్గర ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లాల్లో ఉదయం 9.30 గంటలకు ఆయా జిల్లాల ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి గార్డ్ ఆఫ్ ఆనర్లో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు తదగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.















