EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గ్రంథాలయం ఏర్పాటు చేసే అభ్యర్ధికే ఓటు వేయాలి 

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 2

తెలంగాణ వ్యాప్తంగా అన్నీ మున్సిపల్, కార్పొరేషన్ లలో ఫిబ్రవరి 11 న జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్డులు తమ వార్డుల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఓటర్లకు మద్యం సీసాలు,డబ్బులు మరియు బహుమతులతో ప్రలోభ పెట్టకుండా తమ అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రంథాలయాల ఏర్పాటు కూడా ఒక అంశంగా తమ మేనిఫెస్టోలో ఏర్పాటు చేయాలని, తమ వార్డుల్లో జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని ఓటర్లకు హామీ ఇవ్వాలి. అదేవిధంగా గెలిచిన అభ్యర్థులు తమ వార్డుల్లో ఉన్న కమ్యూనిటీ హాల్ లేదా పార్కుల్లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి.ఓటర్ల ఆరోగ్యం పాడు చేసే ప్రలోభాలకు లోనూ చేయకుండా జ్ఞాన తెలంగాణ నిర్మించడంలో పాలుపంచుకోవాలి. అదేవిదంగా ఓటర్లు కూడా తాము చెల్లిస్తున్న ఆస్తి పన్ను లో గ్రంథాలయ సెస్సు కూడా ఉంటుంది కాబట్టి వారి వద్దకు ఓటు అడగాడానికి అభ్యర్డులు వచ్చినప్పుడు తమ వార్డుల్లో గ్రంథాలయ ఏర్పాటు చేయమని అడగాలి. అదేవిదంగా గ్రంథాలయ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన వారికే ఓటు వేయాలని ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు అందుకుని విపంచి ఫౌండేషన్ రంగారెడ్డి జిల్లా సమయ్వయ కర్త శివశెట్టి శివ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్,కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్లు మరియు మేయర్లు గ్రంథాలయం ఏర్పాటు చేస్తే విపంచి ఫౌండేషన్ బృందం ద్వారా పుస్తకాలు మరియు సహాయ సహకారాలు అందిస్తామని, ఆసక్తి గలవారు 9010324446 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top