ఈతరం భారతం ఆగస్ట్ 22 :హైదరాబాద్(మొయినాబాద్ ) ఆగష్టు 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్); గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలపై సెక్రటేరియట్ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు చేవెళ్ల పర్యటనలో ఉన్న సమయంలో మొయినాబాద్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా రామచంద్ర రావు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన పోరాటాలను అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వ కుట్ర చేస్తుందని,నీళ్లు,డ్రైనేజీ,రోడ్లు,కరెంట్,ట్రాఫిక్ వ్యవస్థలన్నీ కుప్పకూలాయని,రామంతపూర్, పాతబస్తీ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే నన్నారు.ఎన్ని అరెస్టులు, గృహనిర్బంధాలు చేసినా బీజేపీ పోరాటం ఆగదు అని రామ చంద్రా రావు హెచ్చరించారు.















