ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్13: ఆదివారం
___________________________________________
బీసీల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు బీసీ టైగర్ ఆర్. కృష్ణయ్య జన్మదిన వేడుకలను గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరడి భూపేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి బైండ్ల నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యం వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సముచిత రిజర్వేషన్లు, విద్యా–ఉద్యోగ అవకాశాలు మరియు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆర్. కృష్ణయ్య దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీ ఉద్యమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఆర్. కృష్ణయ్య ఆయురారోగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో సంవత్సరాలు బీసీల కోసం సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలెపల్లి శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.














