ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 13 ఆదివారం
__________________________________________
ప్రతి ఏడాది ప్రత్యేక ఆకృతులు భారీ విగ్రహాలతో భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్ గణేష్ మండపంలో ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణంగా నిలవనున్నాడు.ఈ భారీ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి కావడంతో గణేష్ భక్తుల్లో సందడి నెలకుంది. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా ప్రముఖ శిల్పి చిన్న స్వామి రాజేందర్, నేతృత్వంలో 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం సిద్ధమైంది. నగరం నలుమూలల నుంచి భక్తులు భారీ విగ్రహాన్ని దర్శించుకు నేందుకు తరలిరాను న్నారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు ప్రత్యేక ట్రాఫిక్ నిబంధనలు విధించారు.













