EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఘనంగా ముగిసిన సంస్కృత భాష శిబిరం 

ఈతరం భారతం హన్మకొండ ఏప్రిల్ 28

హన్మకొండలో మూడు రోజుల ఉచిత సంస్కృత భాష శిబిరం నేడు ముగింపు.   సంస్కృతభారతి – ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 28 వరకు మూడు రోజులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంస్కృత భాషపై ఆసక్తి ఉన్న వారికి ఉచిత సంస్కృత భాషా ప్రవేశవర్గల శిక్షణ శిబిరం కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, హన్మకొండలోని శ్రీ రామకృష్ణ సేవా మందిరంలో ఘనంగా నిర్వహించబడింది. కేవలం మూడు రోజుల్లోనే సంస్కృతంలో సరళంగా మాట్లాడేలా ప్రత్యేక పద్ధతిలో శిక్షణను ఇచ్చిన సంస్కృత భారతి టీమ్ సభ్యులు అభినందనీయులని, సంస్కృతంలో తర్ఫీదు పొందిన సాధకులు అదృష్టవంతులని, సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఇకనుండి ప్రతి ఆదివారం యోగా, ధ్యానంతో పాటుగా, ఇంగ్లీష్ మరియు సంస్కృత భాషలో శిక్షణ ఇవ్వబడుటకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో వరంగల్ సంస్కృత భారతి ప్రతినిధులు ఆనంద్, వరలక్ష్మి, సంపత్ కుమార్, పేట శ్రీనివాస్ దంపతులు, రామానంద సాగర్, రామన్న, కాకతీయ రచయితల వేదిక అవధాని చేకూరి శ్రీరామ్, దాత డాక్టర్ శివ రాణి, సేవా సమితి ప్రధానకార్యదర్శి ప్రభు చైతన్య, యువ విభాగ్ సభ్యులు నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top