ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 17
ఎల్నినో ప్రభావంతో 2027 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం వల్ల ఎల్నినో సంభవిస్తుంది.ఇది 2026-27 శీతాకాలంలో ఉత్తరార్ధ గోళంపై ప్రభావం చూపి,ఉష్ణమండల దేశాలపై తీవ్రంగా పడనుంది. ఈ పరిస్థితుల వల్ల మునుపెన్నడూ లేని విధంగా 2027లో తీవ్రమైన ఎండలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.















